కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం నిరంకుశ వైఖరీ విడనాడి వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్పీఎం స్టాఫ్ గేట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలకు ఎమ్మెల్యే మద్దతు పలి కారు. 2018 నుంచి ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనివ్వకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల సబ్సిడీ బిల్లులు తీసుకుని కార్మికలకు కనీస వసతులు కూడా కల్పించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక యు వతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే రాష్ట్రాల వారిని తీసుకురావడం దారుణమన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కార్మికశాఖ మంత్రి పేపరు మిల్లు సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వెంకటేశం, భూమయ్య, కౌన్సిలర్ విశ్వేశ్వర్‌రావు, మాజీ కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, నాయకులు సాయి, చరణ్, కార్మికులు పాల్గొన్నారు.


