కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకుంటే రిలే నిరాహార దీక్షలు చేపడుతామని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. పట్టణంలోని ఎస్పీఎం గేటు ఎదు ట మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2018 నుంచి మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదని, జేకే యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల వ లస కార్మికులకు రూ.లక్షల్లో వేతనాలు ఇస్తూ, స్థానికులకు కనీస వేతనం రూ.20వేలు కూ డా ఇవ్వకపోవడం దారుణమన్నారు. మిల్లు పునఃప్రారంభం తర్వాత 250 మంది శాశ్వత కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా అన్యా యం చేసిందన్నారు. తక్షణమే కార్మికశాఖ, రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో చర్చించి ఎన్నికలు నిర్వహించకుంటే రెండు రోజుల తర్వాత రిలే నిరాహార దీక్షలు చేపడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వెంకటేశ్, కలికోట రమణయ్య, గోగర్ల రాములు, రాజేశ్, సీఐటీయూ సంఘం నా యకులు ముంజం ఆనంద్‌కుమార్, శ్రీనివా స్, షబ్బీర్, పాషా, కన్నయ్య పాల్గొన్నారు.


