ఆదర్శ నాయకుడు సుందరయ్య | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ నాయకుడు సుందరయ్య

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: తెలంగాణ సాయుధ పో రాట రథసారధి కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య దేశానికి ఆదర్శ నాయకుడని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం పుచ్చలపల్లి సుందర య్య 41వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ సుందరయ్య చిన్నతనంలోనే అసమానతలు, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి ఇంటి నుంచే పోరాటం ప్రారంభించారని గుర్తు చేశారు. డబ్బు, కులం, మతం, కార్పొరేట్‌ వ్యవస్థలు రాజకీయాలను శాసిస్తున్న ఈ సమయంలో సుందరయ్య వంటి నాయకుల అవసరం పెరిగిందని స్పష్టం చేశారు. యువ త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూ చించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్‌, నాయకులు రాజేందర్‌, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement