కేంద్ర పథకాలపై అవగాహన కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

కేంద్ర పథకాలపై అవగాహన కార్యక్రమాలు

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

కెరమెరి: అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర పథకాలను చేరువ చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పి.రమాదేవి తెలిపారు. మండలంలోని భీమన్‌గోంది, కొలాం కొఠారీ గ్రామాల్లో మంగళవారం పలు కార్యక్రమాల కు హాజరయ్యారు. జన్‌భాగీదారి– సబ్‌ సే దూర్‌, సబ్‌ సే పహ్లే పథకం కింద దూరప్రాంతాల గిరిజనులు, అడవి ప్రాంతాల్లోని వారి కి, ప్రాథమిక సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఈఆర్‌పీ చాహకటి శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement