ఆసిఫాబాద్/కౌటాల: భానుడి ప్రతాపంతో జిల్లా ని ప్పుల గుండంగా మండుతోంది. వారం రోజులుగా మళ్లీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఎండ వేడికి ఉడికిపోతున్నారు. మంగళవారం అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం తీవ్రతకు అద్దం పడుతోంది. సిర్పూర్(టి)లో 45.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, అదే మండలంలోని లోనవెల్లి, ఆసిఫాబాద్, తిర్యాణిలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని మండలాల్లో ఎండలు 43 డిగ్రీలు దాటాయి. నాలుగు మండలాలు రెడ్‌జోన్‌లో ఉండగా.. మిగితా 11 మండలాలు అలెర్ట్ జోన్‌లో ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే వేడి, ఉక్కపోత మొదలవుతుండగా, ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రానున్న నాలుగు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగే ప్రమాదం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత(డిగ్రీ సెల్సియస్‌లో)
సిర్పూర్–టి 45.5
లోనవెల్లి 45.3
ఆసిఫాబాద్ 45.3
తిర్యాణి 45.2
ధనోరా 44.8
కాగజ్‌నగర్ 44.7
కుంచవెల్లి 44.7
తిర్యాణి 44.5
వెంకట్రావ్‌పేట్ 44.5
పెంచికల్‌పేట్ 44.4
కెరమెరి 44.1
దహెగాం 44.1
రెబ్బెన 44.1


