సింగరేణి స్థితిగతులపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సింగరేణి స్థితిగతులపై అవగాహన

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం మల్టీ డిపార్టుమెంట్‌ కమిటీ అధికారుల సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులకు సంస్థ గతంలో సాధించిన ప్రగతి, భవిష్యత్తు కార్యాచరణ, ఉద్యోగులు, యంత్రాల వినియోగంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సింగరేణి స్థితిగతులపై అవగాహన కల్పించారు. జీఎం విజయ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సంస్థ గతంలో సాధించిన లక్ష్యాలు, భవిష్యత్తులో లక్ష్యాల సాధనకు ఉద్యోగుల పనితీరు ఎలా ఉండాలో వివరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శేషశయనరావు, కిరణ్‌, ఏరియా సీఎంవోఏఐ అధ్యక్షుడు, పీవో నరేందర్‌, ఇంజినీర్‌ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement