ఆసిఫాబాద్: నీతి ఆయోగ్ ద్వారా సంపూర్ణత అభియాన్‌లో భాగంగా ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయం నుంచి సీఈవో నీతి చిబ్బార్, ఇతర అధికారులతో కలిసి దేశంలోని ఆకాంక్షిత బ్లాక్‌ల్లో చేపడుతున్న అభివృద్ధిపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ తిర్యాణి మండలంలో ఆర్ట్ విలేజ్, లైబ్రరీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, ఆకాంక్షిత మండల సమన్వయకర్త బాలరాజు, రాజారామ్ పాల్గొన్నారు.
ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి 18 జిల్లాల్లో వరదలు, అగ్ని ప్ర మాదాలపై నిర్వహించిన మాక్ ఎక్స్‌ర్‌సైజ్ నమూనా ప్రదర్శన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధి కారులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రా ష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందన్నారు. నదులు, వాగులు, ఉధృతంగా ప్రవహించే సమయంలో ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అగ్ని ప్ర మాదాల సమయంలో ఘటనా స్థలికి వేగంగా చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. వేంపల్లి అటవీప్రాంతంలో అటవీ అగ్ని ప్రమాదాల నియంత్రణపై మాక్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించామని తెలిపారు.
మైనార్టీల సమస్యలకు పరిష్కారం చూపాలి
ఉమ్మడి జిల్లాలోని మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా మైనార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ కార్యదర్శి షఫీ ఉల్లా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ మైనార్టీ వసతి గృహాలు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. షాదీఖనాలు, మైనార్టీ ఫంక్షన్ హాళ్లు, ఖబ్రస్తాన్‌లకు ప్రహరీలు, రహదారుల నిర్మిఇంచాలన్నారు. కలెక్టరేట్ నుంచి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నదీమ్‌తో కలిసి కలెక్టర్ కె.హరిత వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.


