ఆసిఫాబాద్‌అర్బన్: సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఆశవర్కర్లు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఆరోగ్య సేవలు అందిస్తున్నా ఆశవర్కర్లకు ఎలాంటి చట్టబద్ధత, సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కనీసం ఫిక్స్‌డ్ వేతనం కూడా ప్రభుత్వం నిర్ణయించలేదని తెలిపారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లెప్రసీ, పల్స్‌పోలియో, ఎన్నికల డ్యూటీ డబ్బులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప, నాయకులు లక్ష్మి, నిర్మల, లావణ్య, అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు.


