దహెగాం: నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, దహెగాం మండలానికి నాలుగు చేతిపంపులు మంజూరు చేశామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం 48 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకులానికి చినరాస్పెల్లిలో ఐదెకరాల ప్రభుత్వ భూమిని వారం రోజుల్లోగా గుర్తించి ఇవ్వాలని తహసీల్దార్ మునవార్ షరీఫ్‌ను ఆదేశించారు. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ కోసం ఐదెకరాలు ఇవ్వాలన్నారు. చిన్న ఐనంలో సబ్‌స్టేషన్ నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి లేఖ
కోత్మీర్ నుంచి దహెగాం వరకు మంజూరైన డబుల్ రోడ్డు నిర్మాణంపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పనులు పూర్తయ్యేనా?’ అనే కథనానికి ఎమ్మె ల్యే స్పందించారు. సోమవారం ఉదయం ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్‌కు లేఖ రాసిన ట్లు తెలిపారు. వర్షాకాలంలోగా రోడ్డు నిర్మాణం పూ ర్తి చేయని పక్షంలో కాంట్రాక్టర్‌పై చర్యలు ఉంటా యన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాపర్తి జయలక్ష్మి, సహకార సంఘం చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


