అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

● డీఎఫ్‌వో బాలామణి

కాగజ్‌నగర్‌టౌన్‌: వేసవిలో అటవీ ప్రాంతాల్లో తర చూ జరిగే అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని డీఎఫ్‌వో బాలామణి అన్నారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని వేంపల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్‌ శాఖల ఆధ్వర్యంలో సోమవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ వేసవిలో చిన్న నిప్పురవ్వ అడవిని బూడిద చేస్తుందన్నారు. అటవీ సిబ్బందితోపాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అడవిలో మంటలు పెడితే వెంటనే సమాచారం అందించాలన్నారు. స్థానికుల సహకారంతోనే వేగంగా మంటలను అదుపులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఫైర్‌ లైన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంటలు వ్యాపించకుండా నియంత్రించవచ్చని తెలిపారు. అనంతరం అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే సిబ్బంది ఎలా స్పందించాలి.. ఫైర్‌బేయర్లు, ఫైర్‌ బీటరుల నీటి ట్యాంకర్లను ఎలా ఉపయోగించాలి.. తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండ్‌ ఎం.నాగభూషణం, జిల్లా ఫైర్‌ అధికారి సురేష్‌, అబ్జర్వర్‌ క్రాంతి, ఎఫ్‌డీవో అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement