రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా ఏప్రిల్ నెలలో 104 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఏరియాకు 2.88 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 3లక్షల టన్నులతో 104 శాతం ఉత్పత్తి సాధించిందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తిని వందశాతం సాధించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 35లక్షల టన్నుల టార్గెట్ నిర్దేశించారని తెలిపారు. మొదటి నెల స్ఫూర్తిని చివరివరకు కొనసాగించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం టి.మధుసూదన్, పర్సనల్ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.


