అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు

May 1 2026 6:15 AM | Updated on May 1 2026 6:15 AM

కై లాస్‌నగర్‌(బేల): బే ల మండలంలోని కీర్తన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.వేముగంటి వరప్రసాద్‌రావు బోధన, సేవ, పరిశోధన రంగాల్లో చేస్తున్న సేవలకుగానూ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌ నుంచి ఫెలో రాయల్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటేడ్‌ సైంటిఫిక్‌ ఇన్నోవేషన్‌ పేరిట విశిష్ట గౌరవాన్ని కల్పిస్తూ ధృవీకరణ పత్రం అందజేసింది. సమీకృత శాసీ్త్రయ అభివృద్ధి, వివిధ విభాగాల్లో అసాధారణమైన కృషి , ఆవిష్కరణలు, నిబద్ధతను ప్రదర్శించిన వ్యక్తులకు ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లుగా స్పష్టం చేసింది.

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

ఉట్నూర్‌రూరల్‌: ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్‌ వంటి దేశాల్లో ఉద్యోగాల కోసం గిరిజన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్‌ మాన్పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ హైదరాబాద్‌ ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ స్టడీస్‌ వంటి ఉన్నత స్థాయి పోస్టులతో పాటు స్ప్రే పెయింటర్‌ (100), ప్యానెల్‌ బీటర్‌ (100), ఆటోమోటివ్‌ మెకానిక్‌ (100), వెల్డర్‌ (100), ఎలక్ట్రీషియన్‌ (120), నర్సులు (90), ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ టెక్నీషియన్‌ (20), అగ్రికల్చర్‌ ఇంజనీర్‌ తదితర పోస్టులు ఉన్నాయన్నారు. 25 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సువారు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ధ్రువీకరణ పత్రాలతో మే 1 నుంచి 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement