ఉట్నూర్‌రూరల్: ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గురువారం పీవో చాంబర్‌లో మాట్లాడుతూ ఈ విజయానికి ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఆశ్రమ పాఠశాలలు ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అదుపుతప్పి ఆటో బోల్తా
నర్సాపూర్ (జి): మండలంలోని నసీరాబాద్ వద్ద గురువారం అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దిలావర్‌పూర్ నుంచి కూలీలతో భైంసా వైపు వెళ్తున్న ఆటో నసీరాబాద్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓబేద్ అనే యువకుడికి గాయాలు కావడంతో 108 కు సమాచారం అందించారు. ఈఎంటీ ఆనంద్, పైలట్ సాయికిరణ్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.


