కెరమెరి/తిర్యాణి: జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. గాలులకు చెట్లు విరిగిపడగా, వడగండ్లతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కెరమెరి మండలం కెలిబి గ్రామంలోని మంగళవారం రాత్రి ఈదురుగాలులకు ప్రాథమిక పాఠశాల భవనంపై చెట్టు విరిగిపడింది. రోడ్డుపై 50 ఏళ్ల భారీ వృక్షం పడడంతో బుధవారం ఉదయం 10 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు పడడంతో మూడు ఇళ్లు దెబ్బతిన్నాయి. కేంద్రె కేశవ్‌కు చెందిన ట్రాక్టర్‌పై చెట్టు పడటంతో దెబ్బతింది. ఇళ్ల రేకులు గాలులకు ఎగిరిపోయాయి. సర్పంచ్ చోలే నాగ్‌నాథ్ పరిస్థితిని పర్యవేక్షించి అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు తిర్యాణి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బుధవారం వడగండ్లు పడ్డాయి.


