రాష్ట్రస్థాయిలో ‘ఆశ్రమ’ విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో ‘ఆశ్రమ’ విద్యార్థి ప్రతిభ

Mar 26 2026 7:27 AM | Updated on Mar 26 2026 7:27 AM

వాంకిడి: ఆశ్రమ పాఠశాలల్లో విభా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఈ ఎల్‌పీ(ఇంగ్లిష్‌ లర్నింగ్‌ ప్రోగ్రాం) పోటీల్లో వాంకిడి మండలం చౌపన్‌గూడ ట్రైబల్‌ వెల్ఫే ర్‌ శాటిలైట్‌ సెంటర్‌కు చెందిన మూడో తరగతి విద్యార్ధి సిడాం భీంరావు ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ మేరకు మంగళవారం ఉ ట్నూర్‌లో ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ చేతుల మీదుగా సైకిల్‌, స్టడీ చైర్‌, స్టడీ మెటీరియల్‌ అందుకున్నట్లు హెచ్‌ఎం మనోహర్‌ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.

గిత్తే కార్తీక్‌ మరో ఘనత

కెరమెరి: మండలంలో ని కెలి– కె గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్‌ మరో ఘనత సాధించా రు. హైదరాబాద్‌, పూణె, ముంబయి, కలకత్తాకు చెందిన 12 మంది విద్యార్థులతో కలిసి మహారాష్ట్రలోని కల్సుబాయి, హరిచంద్రగఢ్‌ శిఖరాలను అధిరోహించారు. అహిల్య నగర్‌ జిల్లాలోని సెండే నుంచి ఈ నెల 21 నుంచి ట్రెక్కింగ్‌ ప్రారంభం కాగా, మంగళవారం సాయంత్రం ముగింది. 1600 మీటర్ల కల్సుబాయి శిఖరం, 1400 మీటర్ల హరిచంద్రగఢ్‌ను నాలుగు రోజుల్లో ఎక్కారు. కాగా, మహారాష్ట్రలోని సందన్‌వ్యాలీలో ఈ నెల 19, 20 తేదీల్లో 12 మంది విద్యార్థులకు కార్తీక్‌ శిక్షణ అందించారు. ట్రెక్కింగ్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement