కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయ ఉద్యమకారుడు అప్పారి వెంకటస్వామి 25వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి మాట్లాడుతూ వెంకటస్వామి ఆదర్శ ఉపాధ్యాయ ఉద్యమనేత అని, యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు. ఆయన నిబద్ధత, నిజాయ తీ, నిరాడంబరత, త్యాగశీలి నేటితరం ఉపాధ్యాయులు ఆచరించాలని సూచించారు. పత్రిక సంపాదకుడిగా చివరి శ్వాస వరకు సేవలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్‌కమలాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బాల కృష్ణ, మహేశ్, సురేశ్, హరీశ్, సమత, కుమారి, విద్యాచరణ్, శ్రీకాంత్, తరుణ్, వంశీ, యుగంధర్, సాయి, ప్రవీణ్ పాల్గొన్నారు.


