వాహనదారులకు ఇబ్బందులు రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

వాహనదారులకు ఇబ్బందులు రానీయొద్దు

Mar 26 2026 7:27 AM | Updated on Mar 26 2026 7:27 AM

● ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: ఇంధనం కోసం గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడిచే బంకులకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు రానీయొద్దని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని పెట్రోల్‌పంప్‌ ఏరియాలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్‌ బంక్‌ను బుధవారం జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ గుడిమళ్ల సందీప్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. బంకులో జరుగుతున్న లావాదేవీలు, రిజిస్టర్లు, టాయిలెట్లు, డ్రింకింగ్‌ వాటర్‌, గాలి పంప్‌మిషన్‌ను పరిశీలించారు. పీవో మాట్లాడుతూ వినియోగదారులకు సక్రమంగా పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేయాలన్నారు. కనీస వసతులు కల్పించాలని, తాగునీరు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఇంధన అవసరం మేరకు ముందస్తుగా తెప్పించుకోవాలని, నో స్టాక్‌ బోర్డులు పెట్టొద్దని సూచించారు. కార్యక్రమంలో పెట్రోల్‌ బంక్‌ ఇన్‌చార్జి ప్రదీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement