ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్‌కు సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన రైసా బేగం కోరింది. వితంతు పింఛన్ మంజూరు చేయాలని జెండాగూడ గ్రామానికి చెందిన లోకండె పెంటుబాయి వేడుకుంది. రహదారి మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని కెరమెరి మండలం పరంధోళి గ్రామానికి చెందిన జగన్నాథ్ వినతిపత్రం అందించారు. పింఛన్ పునరుద్ధరించాలని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన శాన్ మ హమ్మ అర్జీ అందించింది. పట్టా భూమికి అధికారులు కొలతలు నిర్వహించాలని కాగజ్‌నగర్ పట్టణంలోని పోచమ్మ బస్తీకి చెందిన వేల్పురి రామన్ దరఖాస్తు చేసుకున్నాడు. వ్యవసాయ బావి మంజూరు చేయాలని జైనూర్ మండలం గౌరీ గ్రామానికి చెందిన శేఖు వినతిపత్రం అందించాడు. ఏళ్లుగా సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి లావుణి పట్టా మంజూ రు చేయాలని సిర్పూర్(టి) మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన డోంగ్రి దుర్గమ్మ అర్జీ ఇచ్చింది. ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇంటి పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తొలగించాలని కాగజ్‌నగ ర్ పట్టణం సర్‌సిల్క్ కాలనీకి చెందిన సమ్మక్క విన్నవించింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.


