ఆసిఫాబాద్‌అర్బన్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు చర్చించి పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యూ నియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలు రూ.18వేలకు పెంచా లని, సమస్యల పరిష్కారానికి ఐసీడీఎస్‌కు నిధులు కేటాయించాలని, ఎన్‌ఐపీ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ప్రీప్రైమరీ విద్యను అంగ న్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మార్చి 16 నుంచి ఒకపూట బడిని నిర్ణయించాలని, మే 1 నుంచి 31 వరకు ఆటంకాలు లేకుండా సెలవులు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు త్రి వేణి, రాజేందర్, కృష్ణమాచారి, శ్రీనివాస్, వనిత, రాజేశ్వరీ, గంగామణి, అరుణ, నిర్మల, వజ్రమ్మ, అంజలి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


