సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు నో చెప్పండి | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు నో చెప్పండి

Mar 24 2026 7:00 AM | Updated on Mar 24 2026 7:00 AM

ఆసిఫాబాద్‌: సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగానికి నో చెప్పాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈ ఎస్‌.భాస్కర్‌ రెడ్డి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఎకో క్లబ్‌ కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ రవికుమార్‌తో కలిసి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ విని యోగంపై అవగాహన కల్పించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని కలుగుతుందని, భూమి, నీరు, జీవ వ్యవస్థలకు నష్టం చేకూరుతుందన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణులు, నీటి వనరులకు ముప్పు కలుగుతుందని తెలిపారు. వస్త్ర సంచులు, తిరిగి ఉపయోగించే సీసాలు, జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాల వంటి సుస్థిర పద్ధతులను అవలంబించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడొద్దని విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement