జిల్లాలో సరిపడా ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం పడుతోంది. ఒక్కో ఏఫ్‌ఏ మూడు నుంచి నాలుగు పంచాయతీల్లో చేపట్టే పనులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించాలి. మాపై పనిభారం తగ్గించాలి.
– బోయిరే రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉన్నవారితోనే పనులు
ఉపాధిహామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోల కొరత ఉంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడకుండా ప్రస్తుతం ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవో


