ఆసిఫాబాద్‌అర్బన్: మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కె.హరిత, మిషన్ భగీరథ ఈఈ రాకేశ్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మార్చి 29లోగా పెండింగ్ వేతనాలు చెల్లించి, ఇతర సమస్యలు పరిష్కరించా లని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, నెల వేతనం బోనస్, పెట్రోల్ అలవెన్స్‌లతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో వర్కర్స్ యూనియ న్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు బాలేశ్, నాయకులు భాస్కర్, శ్రీకాంత్, వెంకటేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


