రెబ్బెన: సింగరేణి సంస్థ మనుగడకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సింగరేణి సేవ్ జాత కార్యక్రమాన్ని శనివారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో ప్రారంభించారు. ఖైరిగూర, గోలేటి సీహెచ్‌పీలతో పాటు ఇతర విభాగాల్లో గేట్ మీటింగ్‌లు నిర్వహించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని బైక్‌ర్యాలీ చేపట్టారు. సీతారామయ్య మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటు లేక సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. స్థానిక బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. గోలేటిలో ప్రారంభమైన సింగరేణి సేవ్ జాత ఈ నెల 30న కొత్తగూడెంకు చేరుకుంటుందని తెలిపారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా, వంటావార్పు కార్యక్రమాలకు కార్మికులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు వీరభద్రయ్య, వైవీ రావు, మడ్డి ఎల్లయ్య, గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కోశాధికారి చంద్రశేఖర్, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, జగ్గయ్య, రాజేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్‌బాబు, సురేశ్ కోరి, ఫిట్ కార్యదర్శులు మారం శ్రీనివాస్, ఎంబడి రామయ్య తదితరులు పాల్గొన్నారు.


