కాగజ్‌నగర్‌లోని ఈద్గా వద్ద ముస్లింలు
కాగజ్‌నగర్‌లోని ఈద్గాలో నమాజ్ చేస్తున్న ముస్లింలు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: నెలరోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని నూర్‌నగర్ ఈద్గా, కాగజ్‌నగర్ పట్టణంలో ఈద్గాల వద్ద సామూహికంగా నమాజ్ చేశారు. ముస్లిం మత పెద్దలు ఖురాన్ సందేశం చదివి వినిపించారు. ప్రవక్త చూపిన శాంతిమార్గంలో నడవాలని సూచించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ సర్పంచ్ మర్సోకోల సరస్వతి, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, టీయూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, తారిక్ తదితరులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, బీఆర్‌ఎస్ నేత సయ్యద్ అన్సార్ వేర్వేరుగా ఏర్పాటు చేసిన విందులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అబ్దుల్లా నివాసంలో విందుకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు హాజరయ్యారు. ఆసిఫాబాద్‌లో సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కాగజ్‌నగర్‌లోని ఈద్గా వద్ద ముస్లింలకు ఎమ్మెల్సీ దండె విఠల్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


