ఉమ్మడి జిల్లాలో తలసరి, జీడీడీపీలో మార్పులు
గతేడాది నమోదుతో పోలిస్తే వ్యత్యాసం
మిగతా జిల్లాల కంటే ఇంకా వెనుకబాటే
సామాజిక ఆర్థిక ముఖచిత్రం–2026లో వెల్లడి
ముస్లింలతో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, శ్యాంనాయక్, నేతలు
ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్సీ దండె విఠల్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లా వృద్ధిలో మార్పు కనిపిస్తోంది. నాలుగు జిల్లాల స్థూల జాతీయోత్పత్తి (జీడీడీపీ) తలసరి ఆదాయం వృద్ధిలో ఒక్కో జిల్లాలో ఒక్కోతీరుగా నమోదైంది. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాలతో పోలిస్తే గతేడాది కంటే ఈసారి మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం–2026 ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే పలు అంశాల్లో వృద్ధి మొదలైంది. అయితే, గతేడాది నివేదిక, పలు జిల్లాల ర్యాంక్‌లతో పోలిస్తే స్వల్పంగా మారాయి.
జిల్లా భౌగోళిక పరిధిలో ఏడాదిలో జరిగిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తిగా పేర్కొనే జిల్లా స్థూల జాతీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లాలో భిన్నంగా నమోదైంది. మంచిర్యాల జిల్లా స్థూల జాతీయోత్పత్తి స్థిర ధరల్లో గతేడాదితో పోలిస్తే ఆదాయం పెరిగినా ఒక ర్యాంక్ తగ్గింది. నిర్మల్ జిల్లా ఓ ర్యాంక్ పెరిగింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు యథాతథంగా ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో రైతుల చేతిలో సాగులో ఉన్న సగటు కమతం (భూమి) చూస్తే రాష్ట్ర సగటు కంటే ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది తీరుగానే ఉండగా, ఆసిఫాబాద్ స్వల్పంగా పెరిగింది. నిర్మల్, మంచిర్యాల అదేవిధంగా ఉండగా, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం గత సర్వే కంటే సగటున రెండెకరాలు అధికంగా రైతుల చేతిలో సాగులోకి వచ్చింది.
పెరగని తయారీ రంగం
పంట తీవ్రతలో తక్కువే..
తలసరి ఆదాయం (2024–25)
జీడీడీపీ (2024–25) స్థిర, ప్రస్తుత ధరల్లో..
జిల్లా స్థిర ప్రస్తుత ర్యాంక్ గతేడాది ర్యాంక్
మంచిర్యాల 26,375 13,470 21 20
నిర్మల్ 24,078 11,857 22 23
ఆదిలాబాద్ 23,051 11,565 25 25
ఆసిఫాబాద్ 16,465 8,247 31 31
మంచిర్యాల తగ్గింది.. నిర్మల్ పెరిగింది


