మెరుగైన విద్యనందించాలి
కౌటాల: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఎంఈవో గావుడే హన్మంతు అన్నారు. మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో శుక్రవారం మండలంలోని ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. పాఠశాలల్లో పెర్సెంట్ మీటింగ్ నిర్వహించాలని, విద్యార్థుల ప్రగతిని వివరించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నానాజీ, సీఆర్పీలు లాలాజీ, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.


