విద్యార్థులకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: ప్రత్యేక అవసరాల పిల్ల లు క్రీడల్లో రాణించడం అభినందనీయమని కలెక్టర్ హరిత అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండోర్, అవుట్‌డోర్ క్రీడల్లో ప్రతిభ కనబర్చి పథకాలు సాధించిన ప్రత్యేక అవసరాల పిల్లలను శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె అభినందించారు. కలెక్టర్ మా ట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా విద్యార్థులు 2వ స్థానంలో నిలిచారన్నారు. ప్రత్యేక అవస ర పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాల్సి న బాధ్యత ఉపాధ్యాయుల్లో ఉందని పేర్కొన్నా రు. స్పోర్ట్స్ ఇన్‌చార్జి శాంతి కుమార్, సిబ్బంది సతీశ్, సుజాత, రమణ పాల్గొన్నారు.


