నంబర్ వన్‌పై నజర్!
ఇంటర్ ఫలితాల్లో నాలుగేళ్లుగా నంబర్ 2 స్థానం ఈసారి అగ్రస్థానం సాధించేలా విద్యార్థుల సన్నద్ధత జిల్లాలో 33 కళాశాలల్లో 10,301 మంది విద్యార్థులు
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫలితాలో గత కొన్నేళ్లుగా జిల్లా రాష్ట్రంలోనే రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తూ ముందంజలో ఉంటుంది. ఈ సారి కూడ మెరుగైన ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను సన్నద్ధం చేసినట్లు డీఐఈవో రాందాస్ వెల్లడించారు. విద్యార్థుల చదువు కు కొంతమేర స్థానిక, మున్సిపల్ ఎన్నికలు ఆటంకం కలిగించాయి. నవంబర్ నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షకు సన్నద్ధం చేశారు. ఈ సంవత్సరం విద్యార్థుల హాజరు శాతంలో పారదర్శకత కోసం ఫేషియల్ రికగ్నిజేషన్ సిస్టం అమలు చేశారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు ఉత్తమ ఫలితాలు..
ఆరు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో జిల్లా మొదటి, రెండు స్థానాలను కై వసం చేసుకుంటుంది. 2024 –25లో ఫస్టియర్‌లో 70శాతంతో 4వ స్థానం, సెకండియర్‌లో 84శాతంతో 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తామని డీఐఈవో ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాలో 10,301 మంది విద్యార్థులు..
జిల్లాలో మొత్తం 33 కళాశాలలున్నాయి. వీటిల్లో 10,301 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఫస్టియర్‌లో 5,507 మంది ఉండగా జనరల్ 4,612 మంది, ఒకేషనల్ 895 మంది, సెకండియర్‌లో 4,794 మంది విద్యార్థులు ఉండగా జనరల్‌లో 4,032 మంది, ఒకేషనల్‌లో 762 మంది ఉన్నారు. జిల్లాలో 33 కళాశాలల్లో ప్రభుత్వ కళాశాలలు 11 ఉండగా ఫస్టియర్‌లో 2,577 మంది, సెకండియర్‌లో 2,048 మంది ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు 5 ఉండగా ఫస్టియర్‌లో 911 మంది, సె కండియర్ 927 మంది ఉన్నారు. ప్రభుత్వ సెక్టార్‌లో 13 కేజీబీవీల్లో 1069 మంది వి ద్యార్థులు ఉండగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు 5, గిరిజన సంక్షేమ గురుకులాలు 6, మైనార్టీ గురుకుల కళాశాలలు 3, ఎంజీబీఏ గురుకుల కళాశాలలు 4, మోడల్ స్కూల్ కళాశాలలు 2లో 3,838 మంది వి ద్యార్థులున్నారు. ఫస్టియర్‌లో 2019 మంది, జనరల్‌లో 1,832, ఒకేషనల్‌లో 187, సెకండియర్‌లో 1819 ఉండగా జనరల్‌లో 1,645 మంది, ఒకేషనల్‌లో 174 మంది ఉన్నారు.
25 నుంచి పరీక్షలు..
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. 25న ఫస్టియర్ తెలుగు, 26న సెకండియర్ తెలుగు, 27, 28 తేదీల్లో ఇంగ్లిష్ పరీక్ష, మార్చి 2, 4 తేదీల్లో గణితం, బయో సైన్స్, పొలిటికల్ సైన్స్, 5, 6 తేదీల్లో పార్ట్ (బి) గణితం, జూవాలజీ, చరిత్ర, 9, 10 తేదీల్లో ఫిజికల్ సైన్స్, ఎకనామీ, 12, 13 తేదీల్లో కెమిస్ట్రీ, కామర్స్, 14, 16 తేదీల్లో బ్రిడ్జి కోర్సు, పబ్లిక్ అడ్మిస్టేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
కొన్నేళ్లుగా ఇంటర్ ఫలితాల్లో జిల్లా స్థానం..
ఫస్టియర్‌లో సెకండియర్‌లో
సంవత్సరం ఉత్తీర్ణత స్థానం ఉత్తీర్ణత స్థానం
2018 –19 71శాతం 3 80శాతం 1
2019 –20 68శాతం 3 75శాతం 2
2020 –21 71శాతం 2 80శాతం 1
2021 –22 70శాతం 3 76శాతం 2
2022 –23 74శాతం 3 81శాతం 2
2023 –24 61శాతం 4 81శాతం 2
2024 –25 70 శాతం 4 84 శాతం 2


