‘సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం’ | - | Sakshi
Sakshi News home page

‘సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం’

Feb 21 2026 6:59 AM | Updated on Feb 21 2026 6:59 AM

‘సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం’

‘సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం’

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రతీ నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్‌ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎన్న తిరుమల, పోషన్నలకు చెందిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ ఇరుకుల మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన ఇంటిని రిబ్బెన కట్‌ చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికి గూడు కల్పించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. నూతన ఇంటి గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు రాపర్తి కార్తీక్‌, గోవింద్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement