ప్రశాంతంగా తొలి విడత పోలింగ్
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కెరమెరి/వాంకిడి: జిల్లాలోని కెరమెరి, జైనూ ర్, సిర్పూర్(యూ), లింగాపూర్, వాంకిడి మండలాల్లో తొలి విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కెరమెరి మండలం కొ ఠారిలోని పోలింగ్ కేంద్రంతోపాటు వాంకిడి మండలం బెండారలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం ఎస్పీ నితిక పంత్, ఎన్నికల పరి శీలకుడు శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టామని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు కేంద్రాలకు వారందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు.


