ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఏఎస్పీ చిత్తరంజన్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళా శాలలో బుధవారం విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నో ర్యాగింగ్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ వైద్యులు ఎదగాలని ఆకాంక్షించారు. కలిసిమెలిసి ఉంటూ ర్యాగింగ్‌కు పా ల్పడొద్దన్నారు. వైద్యులను సమాజంలో దైవంతో సమానంగా చూస్తారని, భవిష్యత్తులో పేదలకు వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.


