పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కౌటాల/చింతలమానెపల్లి: రెండో విడత పంచాయతీ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. కౌటాల మండలం గుండాయిపేట, గుడ్లబోరి, చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ, రణవెల్లి, బూరెపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ నెల 14న జరిగే రెండో విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సిబ్బంది ముందురోజు సాయంత్రం 4 గంటల కు కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సామగ్రి, కవర్లు, పేపర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు ప్రమోద్‌కుమార్, వెంకటేశ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు చంద్రశేఖర్, నరేశ్, ఆర్‌ఐ దిలీప్, కార్యదర్శులు తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


