● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన పల్లెలు ఓటేసేందుకు పోటెత్తాయి. చలితీవ్రత అధికంగా ఉన్నా తరలి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఐదు మండలాల్లో గురువారం తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 96,068 మంది ఓటర్లకు 76,668 మంది ఓటు వేయగా, 79.81శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలాచోట్ల రాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు అధికంగా విజయం సాధించినట్లుగా తెలుస్తోంది.
కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లో మొత్తం 114 పంచాయతీలు, 944 వార్డులు ఉండగా.. ఏడు సర్పంచ్, 576 వార్డు స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. వాంకిడి మండలం తేజాపూర్ పంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ కాగా, అక్కడ అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే 36 వార్డు స్థానాలకు నామి నేషన్లు రాకపోవడం, ఐదు వార్డుల్లో వివిధ కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. 107 సర్పంచ్, 327 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
చలి ప్రభావం
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం ఈ ఏడాది రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు తక్కువ పోలింగ్ నమోదైంది. 11 గంటల తర్వాత పోలింగ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలిలోనూ ఓటర్లు ఉదయం 7 గంట నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మధ్యాహ్నం 12 గంటల వరకే పోలింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఒక్కొక్కరు మాత్రమే వచ్చి ఓటు వేశారు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పోల్చుకుంటే 6.41 శాతం పోలింగ్ తగ్గింది. గతంలో 86.30 శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం 79.81 శాతం నమోదైంది. అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత తొలి ఫలితం వెలువడడం ప్రారంభమైంది.
పోలింగ్ సాగిందిలా..
అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసుకుని ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభించారు. ఐదు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 18,532(19.29శాతం) మంది ఓటు వేయగా, 11 గంటల వరకు 56,785(59.11శాతం) మంది, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 74,791(77.85శాతం) మంది ఓటు వేశారు. మొత్తంగా 76,668(79.81) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తప్పని తిప్పలు
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటువేసే అవకాశం కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు సహాయకులతో వచ్చి ఓటువేశారు. వృద్ధులను వీల్‌చైర్లపై కేంద్రాలకు తీసుకువచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
వృద్ధుడిని తీసుకువస్తున్న సహాయకులు
కెరమెరిలో చంటిపిల్లలతో వస్తున్న మహిళలు
వీల్ చైర్‌పై వస్తున్న వృద్ధురాలు
గంటల వారీగా పోలైన ఓట్లు, శాతం
మండలం 9గంటలు 11గంటలు ఒంటిగంట వరకు మొత్తం
జైనూర్ 4,820(19.78) 13359(54.83) 18,720(76.84) 18,714(76.81)
కెరమెరి 2,558(11.13) 16,143(70.21) 17,941(78.03) 19,171(83.38)
లింగాపూర్ 2,041(23.02) 4,750(53.57) 7,057(79.59) 7,059(79.61)
సిర్పూర్(యూ) 3,200(26.06) 7,666(62.44) 9,798(79.81) 9,966(81.18)
వాంకిడి 5,913(21.45) 14,867(53.93) 21,275(77.17) 21,760(78.93)
మొత్తం 18,532(19.29) 56,785(59.11) 74,791(77.85) 76,668(79.81)
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో


