బరిలో రిటైర్డ్ ఎంఈవో
ఆసిఫాబాద్ మండలంలో నూతనంగా ఏర్పడిన రాజంపేట్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా రిటైర్డ్ ఎంఈవో నాంపెల్లి శంకర్ బరిలో ఉన్నారు. శంకర్ 1981లో ఎస్జీటీగా బూర్గుడ పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎంఏ, బీఈడీ పూర్తిచేసి 1989లో స్కూల్ అసిస్టెంట్‌గా నియామకయ్యారు. ఎంఏ పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎంఈడీ సైతం పూర్తి చేశారు. 2005లో తిర్యాణి ఎంఈవోగా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత సర్పంచ్ పోటీలో నిలిచారు. కొత్త పంచాయతీని ఉత్తమంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొంటున్నారు.


