గిన్నెధరి @ 6.0 డిగ్రీలు
కౌటాల(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతోపాటు చల్ల గాలులు వీస్తున్నాయి. బుధవారం తిర్యాణి మండలం గిన్నెధరి, సిర్పూర్(యూ)లో 6.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తిర్యాణిలో 7.3 డిగ్రీలు, కెరమెరి 7.9, ఎల్కపల్లి 9.1, ధనోరా 9.4, బెజ్జూర్ 10.0, రెబ్బెనలో 10.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. పగలు సైతం చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లేవారు కూడా సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్స్, మాస్క్‌లు ధరించి తిరుగుతున్నారు.


