
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, పీఎం జన్‌మన్ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందన్నారు. మండల కేంద్రాల్లో చేపట్టిన మోడల్ ఇళ్లు పూర్తిచేయాలన్నారు. పీఎం జన్‌మన్ పథకం కింద 2,167 మంది లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, రోడ్డు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులు, కల్వర్టులు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీటీడీవో రమాదేవి, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.