
‘బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వండి’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 18న చేపట్టిన తెలంగాణ బంద్‌కు మద్ద తు తెలపాలని బీసీ జేఏసీ చైర్మన్ రూప్‌నార్ రమేశ్ కోరారు. ఈ మేరకు గురువారం రాజకీ య పార్టీల నాయకులతోపాటు కుల, వ్యాపా ర, ఇతర సంఘాల ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మల్లికార్జున్, కిరాణ మర్చంట్ అధ్యక్షుడు గుండా ప్రమోద్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్‌ను కలిసి బంద్‌కు పోలీసు శాఖ సహకరించాలని కోరారు.