
నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి
ఆసిఫాబాద్: నూతన ఓటర్లకు తపాలాశాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నా రు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికా రి మాట్లాడుతూ ఓటరు జాబితాలో వందేళ్లు కలిగిన ఓటర్లను గుర్తించి, వారి వయస్సుకు త గిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఓటరుగా నమోదైన వారికి తపాలాశాఖ ద్వారా ఓటరు కార్డులు పంపిస్తున్నామని తెలిపారు. వందేళ్లకు పైబడిన వారిని గుర్తిస్తామన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని బూత్‌స్థాయి అధికారులకు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. సమావేశంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, ఎన్నికల పర్యవేక్షకుడు శ్యాంలాల్, అధికారులు పాల్గొన్నారు.