టెండర్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

టెండర్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి

Oct 10 2025 5:58 AM | Updated on Oct 10 2025 5:58 AM

టెండర్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి

టెండర్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రి య సజావుగా చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ రఘురామ్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఆయన మా ట్లాడుతూ దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ నెల 18న దరఖా స్తుల స్వీకరణకు చివరి తేదీ కాగా, ఈ నెల 11న రెండో శనివారం కూడా దరఖాస్తులు స్వీకరించనున్న ట్లు తెలిపారు. జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి జ్యోతి కిరణ్‌, సీఐలు రమేశ్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

మద్యం దుకాణాలకు 34 దరఖాస్తులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య కొనసాగుతోంది. గురువారం వరకు జిల్లాలో 34 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి జ్యోతికిరణ్‌ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకా ణాలు ఏర్పాటు చేయనుండగా, దరఖాస్తులకు ఈ నెల 18 వరకు ప్రభుత్వం గడువు విధించిందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 1న నూతన మద్యం షాపులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement