
‘బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’
కాగజ్‌నగర్‌రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాగజ్‌నగర్ మండలం కోసినిలోని ప్రాణహి త నిలయంలో గురువారం విలేకరులతో మాట్లాడా రు. జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆధిపత్య వర్గాల నాయకులు కోర్టులో కేసు వేసి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా లాక్కున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు కొంగ సత్యనారాయణ, సలీం, మిన్హాజ్, వెంకటేశం, పోశం తదితరులు పాల్గొన్నారు.