
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌రూరల్: పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని బీసీ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గురువారం జిల్లా కేంద్రంలో బీసీ డీడీ శివకుమార్‌కు వినతిపత్రం అందించారు. పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ బీసీ పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. వారికి కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది లక్ష్మి, శారద, పార్వతి, జ్యోతి, సరోజ తదితరులు పాల్గొన్నారు.