
నాణ్యమైన విద్యనందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. జైనూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎం పార్వతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పీవో మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. విద్యార్థినులకు ఐరన్, విటమిన్ సీ మాత్రలు అందించాలన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యసేవల వివరాలపై ఆరా తీశారు. వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.