
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
దుర్గాదేవి అవతారంలో అమ్మవారు
రెబ్బెన(ఆసిఫాబాద్): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పొటెత్తారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలతో పాటు సమీపంలోని మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళితోపాటు ఆలయం వెనుక గుహలో ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా మంగళవారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్ డీఎల్‌పీవో హరిప్రసాద్, నంబాల మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, గోగర్ల రాజేశ్, మాజీ ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు