
సింగరేణి క్రీడాకారులు పతకాలు సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు కోలిండియా పోటీల్లో పతకాలు సాధించాలని డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహా రా అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ వార్షిక క్రీడల్లో భాగంగా మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్‌లో నియర్‌బై ఏరియా క్యారమ్స్, చెస్ పోటీలు ప్రారంభించారు. డీజీఎం మాట్లాడుతూ కోలిండియా పోటీల్లో రాణించి సింగరేణికి గుర్తింపు తీసుకురావాలన్నారు. క్రీడానైపుణ్యాలు మెరుగుపర్చుకోవా లని సూచించారు. ఈ సందర్భంగా గతంలో కోలిండియాలో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.