
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించా లని, వేతనాలు చెల్లించాలని గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె మంగళవారం 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కార్మికులు మాట్లాడుతూ చేసిన పనికి వేతనా లు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పెండింగ్ వేతనా లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి ఆరో పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, వర్కర్లు ప్రభాకర్, వసంత్‌రావు, కోటయ్య, భరత్, శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి, ప్రమీల, తిరుపతి, దివ్య, మాన్కుబాయి తదితరులు పాల్గొన్నారు.