
కేసులు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో వన్యప్రాణుల వేటకు సంబంధించిన కేసులను త్వరగా పరి ష్కరించాలని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి గురువారం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ పోలీస్, అటవీశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. అటవీ జంతువులను వేటాడిన కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్, సిబ్బంది ముసవీర్, ఝాన్సీరాణి, సద్దాం తదితరులు పాల్గొన్నారు.