
నేరరహిత సమాజం కోసం కృషి
ఆసిఫాబాద్‌అర్బన్: నేరరహిత సమాజం కోసం పోలీసులు కృషి చేయాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్టేషన్లకు వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీఐలు బాలాజీ వరప్రసాద్, రమేశ్, సత్యనారాయణ, సంజయ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.