
మోదీ ఆధ్వర్యంలో రైల్వేల అభివృద్ధి
కాగజ్‌నగర్‌టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశంలోని రైల్వేలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గురువారం కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్ –నాగ్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌ను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది వందేభారత్ రైలును సికింద్రాబాద్– నాగ్‌పూర్ రైలును ప్రారంభించగా, అప్పటినుంచి కాగజ్‌నగర్ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలని డిమాండ్ ఉందన్నారు. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇక్కడ వందేభారత్‌కు స్టాప్ సౌకర్యం కల్పించారని తెలిపారు.
సికింద్రాబాద్, నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ఉపయోగకరం
అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్, నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైల్వే స్టేషన్‌లో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వారం రోజుల్లో నాలుగు రైళ్లకు హాల్టింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే సిర్పూర్ టౌన్ స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య మరో కొత్త రైలు ప్రవేశపెట్టాలని, చర్లపల్లి హౌరా వయా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు కొత్త రైలు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. సంజీవయ్య కాలనీ వద్ద అండర్ బ్రిడ్జి, చింతగూడ రైల్వే క్రాసింగ్, ఈస్‌గాం రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయన్నారు. కొత్త రైళ్ల హాల్టింగ్‌తో కాగజ్‌నగర్ స్టేషన్‌లో వందకు పైగా ట్రైన్లు ఆగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సికింద్రాబాద్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం.గోపాల్, ముఖ్య సంబంధాల అధికారి శ్రీధర్, దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్‌నాథ్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.