
ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలో గురువారం స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా, జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో అండర్– 19 విభాగంలో వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో, హ్యాండ్‌బాల్, రగ్బీ జోనల్‌స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 150 మంది బాలబాలికలు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 64 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు తెలిపారు. అలాగే జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో అండర్– 14, 17 విభాగంలో బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 140 మంది బాలబాలికలు హాజరు కాగా, 72 మంది క్రీడాకారులను జోనల్‌స్థాయికి ఎంపిక చేశామని ఎస్‌జీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు. ఆదిలాబాద్‌లో త్వరలో జరిగే జోనల్‌స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ అరుణశ్రీ, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరి, పీడీ, పీఈటీలు షేకు, మీనారెడ్డి, చిన్నక్క, తిరుపతి, సాయి, నాగమణి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులు
జోనల్ స్థాయికి ఎంపికై న క్రీడాకారులు

ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు