
ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్
కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన పత్తి పంట క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర సక్రమంగా అందించేందుకు 2025– 26సంవత్సరంలో కొనుగోళ్లు కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేపట్టనున్నారు. పత్తి సాగు చేసిన రైతులు ఈ నెల 30లోగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు పత్తి సాగుచేసిన భూమి సర్వే నంబర్, ఆధార్, ఇతర వివరాలు నమోదు చేయాలి. రెవెన్యూ అధికారుల నుంచి పత్తి పంట ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు అందించాలి. సాగు విస్తీర్ణంతోపాటు ఇతర వివరాలు నమోదు చేయగానే సీసీఐకి వివరాలు చేరిపోతాయి. ఏ ప్రాంతంలో ఎంత సాగు చేశారనే దానిపై అంచనా వస్తుంది. వివరాల ఆధారంగా సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుంది. అండ్రాయిడ్ సెల్‌ఫోన్ లేని వారు సమీపంలోని మీసేవ కేంద్రాలతోపాటు ఏఈవోల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.